● రంపచోడవరం సబ్‌కలెక్టర్‌కె.ఆర్. కల్పశ్రీ
రంపచోడవరం: బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీలు నిర్మూలించే బాధ్యత అందరిపై ఉందని రంపచోడవరం సబ్ కలెక్టర్ కె.ఆర్.కల్పశ్రీ అన్నారు. వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి గ్రామంలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు,బాల్య వివాహాలు నిర్మూలించే విధంగా గ్రామ పంచాయతీ, సచివాలయాల పరిధిలో అందరికీ అవగాహన కల్పించాలన్నారు. 18 సంవత్సరాల లోపు బడిబయట పిల్లలను గుర్తించి జాబితా తయారు చేయాలని ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన బాలికలు ఎంత మంది ఉన్నారో జాబితా తయారుచేయాలని తెలిపారు. తహసీల్దార్‌లు శ్రీనివాసరావు, వేణుగోపాల్, కె.సూర్యనారాయణ, బాలాజీ, ఎంపీడీవో సుండం శ్రీనివాసదొర, ఎంఈవో వి.ముత్యాలరావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.