ముంచంగిపుట్టు: స్థానిక సబ్ పోస్టాఫీసు ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని అరకు సబ్ డివిజనల్ పోస్టల్ ఐపీవో వి.లక్ష్మీకిశోర్ తెలిపారు. స్థానిక ఎంపీడీవో సూర్యనారాయణమూర్తిని ఆయన సోమవారం కలిశారు. సబ్ పోస్టాఫీసు ఏర్పాటుకు అనుకూలమైన భవనం మంజూరు చేయాలన్నారు. స్థానిక ఇంజినీరింగ్ కార్యాలయ భవనంతో పాటు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలు చూపించాలని కోరారు. దీనికి ఎంపీడీవో సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఐపీవో మాట్లాడుతూ పాడేరు ఐటీడీఏ పీవోను సైతం కలిసి భవన సౌకర్యం కల్పించాలని కోరామన్నారు. కార్యక్రమంలో పెదబయలు ఎంవో ఎం.శ్రీను, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.