
హైవే నిర్వాసితులకు నష్టపరిహారం
గూడెంకొత్తవీధి: జాతీయ రహదారి (516–ఈ) నిర్మాణంలో భూములను కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ తెలిపారు. సోమవారం గూడెంకొత్తవీధి మండలంలో జాతీయ రహదారి నిర్మాణం జరిగే ప్రాంతాలను ఆయన పరిశీలించారు. పెదవలసలో గిరిజనులతో మాట్లాడారు. రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దారు రామకృష్ణ, ఆర్‌ఐ మహదేవ్, వీఆర్వో సత్యమణి, సర్వేయర్ నాగేశ్వరరావు, జాతీయ రహదారి విభాగం అధికారి లోకేష్ పాల్గొన్నారు.