సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను కొలువుంచారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపారు. 108 స్వర్ణసంపెంగలతో అష్టోత్తరశతనామావళి పూజ నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు.
వైభవంగా నిత్యకల్యాణం
వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను అధిష్టింపజేశారు. ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు.