పాడేరు రూరల్ : జిల్లా ఫౌరసరఫరాల సంస్థలో అకౌంటెంట్ గ్రేడ్–3 పోస్టులో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఏ లేదా సీఎంఏలో సెమీ క్వాలిఫైడ్ (ఆయా కోర్సుల్లో ఇంటర్ పాసైన అభ్యర్థులు) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తామని స్థానిక అభ్యర్థులకు తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కలెక్టరేట్‌లోని ఫౌరసరఫరాల శాఖ కార్యాలయం నుంచి దరఖాస్తులు పొంది వాటిని పూర్తి చేసి ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలలోపు అందజేయాలని ఆయన కోరారు.