సక్రమంగా నిత్యావసర సరకుల పంపిణీ

జీఎం వలస ఎంపీపీ పాఠశాల వద్ద   వివరాలు  తెలుసుకుంటున్న  శివప్రసాద్‌  - Sakshi

మారేడుమిల్లి: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు నిత్యావసర సరకులను సకాలంలో పంపిణీ చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆర్‌.శివప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం ఆయన మండలంలోని గుజ్జుమామిడి వలస గ్రామంలో డీఆర్‌ డిపో, అంగన్‌వాడీ కేంద్రం, ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేశారు. సరకుల పంపిణీపై ఆరా తీశారు. అంగన్‌వాడీకి, మధ్యాహ్ననం భోజనం పథకానికి అందిస్తున్న సరకుల నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ జి. గణేష్‌, సహాయ పౌరసరఫరాల అధికారి శ్రీహరి, జీసీసీ మేనేజర్‌ ఎం.ఎన్‌. రాజా రెడ్డి పాల్గొన్నారు.

జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి శివప్రసాద్‌




 

Read also in:
Back to Top