ఆదిలాబాద్‌రూరల్: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బ స్టాండ్ ఎదుట గల పాపన్నగౌడ్ విగ్రహం వద్ద నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ ముఖ్య అతి థిగా హాజరై పాపన్నగౌడ్ విగ్రహం, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పా పన్నగౌడ్ ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికా రికంగా నిర్వహిస్తూ యువతకు ఆయన చరిత్రను ప రిచయం చేస్తోందని వివరించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, జిల్లా బీసీ అభివృద్ధి అధి కారి దరావత్ సోనియా, డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జా దవ్, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, గండ్రత్ సుజాత, సా జిద్‌ఖాన్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చి క్కాల దత్తు, వివిధ సంఘాల నాయకులున్నారు.


