చెక్కు అందజేత | - | Sakshi
Sakshi News home page

చెక్కు అందజేత

Apr 3 2026 7:56 AM | Updated on Apr 3 2026 7:56 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ఇంద్రవెల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే రాథోడ్‌ విలాస్‌ జనవరి 5న గుండెపోటుతో మృతి చెందగా పోలీస్‌శాఖ కార్పస్‌ ఫండ్‌ నుంచి మంజూరైన రూ.లక్ష చెక్కును ఎస్పీ అఖిల్‌ మహాజ న్‌ గురువారం జిల్లా పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో అతడి భార్య జ్యోతికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సూ పరింటెండెంట్‌ సులోచన, సీసీ కొండరాజు, పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement