ఆదిలాబాద్: ఆర్టీసీ ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్‌గా డి.విజయభాను గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఆర్‌ఎంగా బాధ్యతలు నిర్వర్తించిన ఎస్.భవానీప్రసాద్ వరంగల్‌కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించి న విజయభానుకు ఇప్పటివరకు ఆర్‌ఎంగా విఽ దులు నిర్వర్తించిన భవానీప్రసాద్, డిప్యూటీ ఆ ర్‌ఎంలు రామయ్య, శ్రీహర్ష పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం విజ యభాను కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. డిపో మేనేజర్ జి.ప్రతిమారెడ్డి పాల్గొన్నారు.


