పకడ్బందీగా పథకాల అమలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పథకాల అమలు

Apr 3 2026 7:56 AM | Updated on Apr 3 2026 7:56 AM

● గ్రామసభలో కలెక్టర్‌ రాజర్షి షా ● ఏజెన్సీ కోర్టు భవనం ప్రారంభం

ఉట్నూర్‌ రూరల్‌: అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభు త్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ రాజర్షి షా పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి నివేదికలో భాగంగా మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం స్థానిక సర్పంచ్‌ అనిత–శ్రీనివాస్‌ జాదవ్‌ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర గీతం ఆలపించారు. అ నంతరం సీఎం రేవంత్‌రెడ్డి సందేశాన్ని ఎంపీడీవో రామ్‌ప్రసాద్‌, గ్రామపంచాయతీ నివేదికను పంచా యతీ కార్యదర్శి శంకర్‌ గ్రామసభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఖా నాపూర్‌ నియోజకవర్గానికి కొత్తగా రెసిడెన్షియల్‌ స్కూల్‌ మంజూరైందని తెలిపారు. ఉట్నూర్‌లోని ఐ టీఐలో టాటా సంస్థ సహకారంతో అడ్వాన్స్‌డ్‌ టె క్నాలజీ సెంటర్‌ ప్రారంభమైందని తెలిపారు. దీని ద్వారా 200మంది యువతకు రోబోటిక్స్‌, ఇంటర్నె ట్‌ ఆఫ్‌ థింగ్స్‌ లాంటి ఆధునిక అంశాల్లో శిక్షణ ఇ చ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. గ్రా మాల్లోని తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ లాంటి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. అనంతరం వెదురు తయారీదారుల ఇ ళ్లకు వెళ్లి వారి జీవనోపాధి గురించి తెలుసుకున్నా రు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే గ్రా మసభల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అధికా రుల సమన్వయంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ సభలో శిక్షణ కలెక్టర్‌ సలోని చబ్రా, అదనపు వైద్యాధికారి మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

కోర్టు భవనం ప్రారంభం

ఉట్నూర్‌ ఆర్డీవో కార్యాలయంలో ఏజెన్సీ కోర్టు భవనాన్ని కలెక్టర్‌ రాజర్షి షా ప్రారంభించారు. మండల కేంద్రంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఏజెన్సీ కోర్టు సముదాయాన్ని ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మట్‌తో కలిసి సందర్శించారు. సబ్‌ కలెక్టర్‌ కా ర్యాలయంలోనీ రికార్డు గది, కంప్యూటర్‌ గది, వివి ధ విభాగాలను కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ సలోని చబ్రా, న్యాయవాదులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

‘గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం’

బజార్‌హత్నూర్‌: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లేపూల నర్సయ్య పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. మండల కేంద్రంతో పాటు 30 గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌, సర్పంచులు పరచ సాయన్న, కృష్ణకాంత్‌రెడ్డి, ప్రియాంక, అనిత, సాయినాథ్‌, మాధవ్‌, దేవుబాయి, రజక్‌, విజయ, నాందేవ్‌, అనిల్‌, ప్రవీణ్‌, కై లాస్‌ పాల్గొన్నారు.

సృజనాత్మకతను వెలికితీయాలి

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని ప్ర భుత్వ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ అతీఖ్‌ బేగం సూచించా రు. నేషనల్‌ గ్రీన్‌ కార్ప్‌, ఈకో క్లబ్‌ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని కళాశాలలో విద్యార్థులు మట్టితో వివిధ రకాల ఆకృతులను తయారు చేశారు. హైడల్‌ మేకింగ్‌, సీడ్‌బాల్స్‌ అండ్‌ మేకింగ్‌, అనేక రకాల విత్తనాలతో కలిపి మ ట్టిలో గుండ్రంగా చుట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ వారిని అభినందించా రు. వానాకాలంలో అడవులు, ఖాళీ ప్రదేశాల్లో వేస్తే అవి మొలకెత్తుతాయని ప్రి న్సిపల్‌ తెలిపారు. కార్యక్రమంలో కునాల్‌, అశ్విని, స్వప్న, నరేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement