సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్‌ను సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో కమిటీలన్నింటి నీ పటిష్టపర్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రంలో ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నే తలు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రణాళిక రూపొందించేందుకు ఆ పార్టీ నాయకత్వం ముందుకుపోతోంది. ఇందులో భాగంగా శనివారం జిల్లా కేంద్రానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ రా నున్నారు. జిల్లా పొలిటికల్ ఎఫైర్ కమిటీ సభ్యులతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భవి ష్యత్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలా ముందుకు కదలాలో దిశానిర్దేశం చేయనున్నారు.
అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబి తా సవరణ స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (సర్) నేపథ్యంలో పార్టీ క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)లు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఓటరు జాబితాలను నవీకరించడానికి, వాటిలో కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసిందే. కొత్త ఓటర్లను చేర్చడం, అనర్హులైన, పునరావృతమైన పేర్లను తొలగించడం, కచ్చితత్వమైన ఓటరు జాబితాలు రూపొందించడం అంశాలుగా ‘సర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా రు. అయితే, ఇందులో ఎ లాంటి లోపాలు ఎదురైనా బీ ఎల్‌ఏలు ఎలా ముందుకెళ్లా లి.. అనే విషయంలో హస్తం పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది.
కొత్త చట్టాల నేపథ్యంలో..
కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సెషన్‌లోనే డీ లిమిటేషన్ బిల్లు తీసుకువచ్చే అవకాశాలున్నాయనే చర్చ జోరుగా సాగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై కూడా అధిష్టానం దృష్టి సారించింది. లోక్‌సభతో పాటు శాసనసభ నియోజకవర్గ స్థానాల పెంపునకు ఆమో దం లభించే అవకాశమున్న దృష్ట్యా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను మెరుగుపరిచేందు కు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకే రాష్ట్ర నాయకత్వం పర్యటిస్తుందని పార్టీలో చెప్పుకొంటున్నారు. మహిళా రిజర్వేషన్, ఇతర అంశాల్లోనూ పార్టీ అనుసరించాల్సిన పద్ధతులు, నూతనంగా వస్తున్న చట్టా లు, ఇలా అన్ని అంశాల్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు పార్టీ అధిష్టానం ముందుకెళ్తోంది.


