మెరుగైన వైద్యసేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యసేవలందించాలి

Apr 3 2026 7:56 AM | Updated on Apr 3 2026 7:56 AM

సాత్నాల: రోగులకు మెరుగైన సేవలందించాలని డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ జాదవ్‌ దేవిదాస్‌ సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భోరజ్‌ మండలం గిమ్మ ప్రాథమిక ఆస్పత్రిని గురువారం తనిఖీ చేశారు. ఎన్‌సీడీ స్కానింగ్‌, సదుపాయాల పరిశీలన, రికార్డులు, నివేదికలు, పరికరా లు, మందుల వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమయానుకూల వై ద్యసేవలు అందించేందుకు కృషి చేయాలని, ఆస్పత్రికి వచ్చే ప్రతీ రోగితో మర్యాదపూర్వకంగా వ్యవహరించడంతోపాటు సరైన చికిత్స అందించాలని సూచించారు. మందుల కొరత లేకుండా చూసుకో వాలని, అత్యవసర సేవలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచాలని ఆదేశించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, రో గులకు తాగునీరు, అవసరమైన వసతులు కల్పించడం లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అమర్నాథ్‌, ఎన్‌సీడీ కోఆర్డినేటర్‌ రమణ, సుచల, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement