పథకాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Apr 3 2026 7:56 AM | Updated on Apr 3 2026 7:56 AM

కై లాస్‌నగర్‌: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్‌ కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌ సూ చించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని 49 వార్డుల్లో వార్డు సభలు నిర్వహించారు. 45వ వార్డులో నిర్వహించిన సభకు ఆయన హాజరయ్యారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూషతో కలిసి రాష్ట్ర గీతాన్ని ఆలపించి సభ ప్రారంభించారు. సీఎం రేవంత్‌ రెడ్డి సందేశాన్ని ప్ర జలకు వివరించారు. అనంతరం చైర్‌పర్సన్‌ వార్డులో చేపట్టిన పనులతో పాటు ప్రభుత్వ పథకాల గు రించి వివరించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలు, పథకాలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో సుమారు ఆరువేల ఇందిరమ్మ ఇళ్లకు గాను 1,600 ఇళ్లు పట్టణంలో నిర్మించనున్న ట్లు తెలిపారు. మిగతా వార్డుల్లో కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్ల ఆధ్వర్యంలో సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మున్సిపల్‌ కమిషనర్‌ రాజు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ జాదవ్‌ శేషరావు, మెప్మా పీడీ సీవీఎన్‌ రాజు, డీఎంసీ శ్రీనివాస్‌, వార్డు ఆఫీసర్‌ ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement