కైలాస్‌నగర్: ఈ నెల 6న బజార్‌హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభను విజయవంతం చే యాలని డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్ కోరారు. గు రువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఎన్నికలకు ముందు పిప్రి గ్రామం నుంచి చేపట్టిన ‘పీపుల్ మార్చ్ పాదయాత్ర’ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామంలో పర్యటించనున్నట్లు తెలిపారు. సీఎం సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూ పల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మ హేశ్‌కుమార్‌గౌడ్ ఈనెల 4న పిప్రి గ్రామంలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. తొలుత ఆదిలాబాద్‌లో పార్టీ శ్రేణులతో సమావేశమవుతారని తెలిపా రు. ఆయన వెంట మాజీ ఎంపీ సోయం బాపూరా వు, నాయకులు సాజీద్‌ఖాన్, బొరంచు శ్రీకాంత్‌రెడ్డి, గండ్రత్ సుజాత తదితరులున్నారు.


