బజార్‌హత్నూర్‌లో నేలవాలిన మొక్కజొన్న పంట
రాంనగర్‌లో ఎగిరిపడ్డ ఇంటిపైకప్పు
రోడ్డుపై అడ్డుగా పడిన చెట్టు
బజార్‌హత్నూర్ మండల కేంద్రంతోపాటు దేగామ, బోస్రా, జాతర్ల, గిర్నూర్, కొలారి, పిప్రి, కాండ్లీ, బోస్రా, ధరంపురి, టెంబి, రాంనగర్ గ్రామాల్లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. మొక్కజొన్న, జొన్న పంటలు నేలవాలాయి. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. చెట్లు పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయి కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మండలంలో వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. బోథ్, సొనాల మండలాల్లో సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గంటసేపు కురిసిన వడగళ్లతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. – బజార్‌హత్నూర్/బోథ్


