అనారోగ్యంతో బాలింత మృతి | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో బాలింత మృతి

Apr 2 2026 7:35 AM | Updated on Apr 2 2026 7:35 AM

● గత నెల 23న మగ శిశువుకు జననం

● గత నెల 23న మగ శిశువుకు జననం

ఉట్నూర్‌రూరల్‌: మండలంలోని హీరాపూర్‌ –జే గ్రామానికి చెందిన గిరిజన బాలింత కుంర జంగుబాయి (32) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంర చందు –జంగుబాయి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి మొదటి సంతానం 7 సంవత్సరాల పాప ఉంది. రెండో కాన్పు కోసం జంగుబాయి గత నెల 22న రిమ్స్‌లో చేరింది. మరుసటి రోజు మగ శిశువుకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రిమ్స్‌లో నయం కాకపోవడంతో వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌ వెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

తల్లి ప్రేమకు దూరం..

తల్లి జంగుబాయి మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. జంగుబాయికి ఆసుపత్రిలో సరైన చికిత్స అందితే బతికి ఉండేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నా సరైన వైద్యం అందలేదని వాపోతున్నారు. జిల్లా ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నా చికిత్స అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement