ఇంద్రవెల్లి/బోథ్: జిల్లాలో పలుచోట్ల సోమవారం రాత్రి కురిసిన ఈదురుగాలులతో కూ డిన అకాలవర్షంతో పంటలకు నష్టం వాటిల్లింది. ఇంద్రవెల్లి మండలకేంద్రంతో పాటు మండలంలోని దనోరా(బి), ముత్నూర్, గౌరాపూర్, తెజాపూర్, కేస్లాపూర్, అంజీ తదితర గ్రామాల్లో చేతికొచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు నేలకొరిగి దెబ్బతిన్నాయి. ఈమేరకు రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న పంట నష్టం పరిశీలించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే బోథ్, సొనాల మండలాల్లోనూ మొక్కజొన్న, జొన్న పంటలకు నష్టం వాటిల్లింది.


