ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని చాందా (టి) గ్రామానికి చెందిన చిందం చిన్న దేవన్నకు చెందిన ఆవు సోమవారం రాత్రి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగి ఆవుపై పడ్డాయి. దీంతో షాక్ తగిలి ఆవు మృతి చెందింది. మృతి చెందిన ఆవు విలువ రూ.80వేల వరకు ఉంటుందని రైతు తెలిపాడు. ప్రభుత్వం పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరుతున్నాడు.
కౌటాలలో తేనెటీగల దాడి
కౌటాల: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న పలువురిపై మంగళవారం మధ్యాహ్నం తేనెటీగలు దాడి చేశాయి. సమీప చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో స్థానికులు పరుగులు తీశారు. కార్యాలయం తలుపులు మూసుకుని అందులోనే ఉన్నారు. రామగిరి విజయ్, దివాకర్, తిరుమలేశ్, హన్మంతు తేనెటీగల దాడిలో గాయపడగా వారిని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి తరలించి చిక్సిత అందించారు. అధికారులు స్పందించి తేనెటీగల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
డీఅడిక్షన్ సెంటర్‌కు బాలుడి తరలింపు
చెన్నూర్: చెన్నూర్ పట్టణానికి చెందిన బాలుడు (17) గంజాయికి అలవాటు పడడంతో పోలీసులు డీఅడిక్షన్ సెంటర్‌కు తరలించారు. ఇందుకు సంబంధింని వివరాలను మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ బన్సీలాల్ వెల్లడించారు. ఆయన తెలి పిన వివరాల ప్రకారం.. బాధిత బాలుడు స్నేహితులతో కలిసి గంజాయికి బానిసయ్యాడు. మహా రాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి తెచ్చుకుని తాగుతున్నాడు. గతంలో పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అయినా, అతడి ప్రవర్తలో ఎ లాంటి మార్పు రాలేదు. గంజాయి తరచూ సేవిస్తున్నట్లు సమాచారం రావడంతో అతడిని ప ట్టుకుని వైద్యాధికారి సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు రావడంతో కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టా రు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు బాలుడిలో మార్పు రావడానికి వైద్యపరీక్షల నిమిత్తం మంచిర్యాలలోని డీ అడిక్షన్ సెంటర్‌లో అడ్మిట్ చేశారు. ఎవరైనా గంజాయికి అలవాటు పడిడితే వెంటనే ప్రవర్తన మా ర్చుకోవాలని సూచించారు. లేనిపక్షంలో కేసులు నమోదు చేసి డీ అడిక్షన్ సెంటర్‌కు తరలిస్తామని సీఐ హెచ్చరించారు. సమాశంలో ఎస్సైలున్నారు.
విహారయాత్రకు గిరిజన క్రీడాకారులు
ఖానాపూర్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడాపోటీల్లో ప్రతిభ కనబర్చిన గిరిజన క్రీడాకారులకు అరుదైన అవకాశం లభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ, క్రీడా పాఠశాలల విద్యార్థులను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు విహారయాత్రకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థులు జూపార్క్, లుంబిని పార్క్‌ను సందర్శించారు. అనంతరం రవీంద్రభారతిలో నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. విహారయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌తో విద్యార్థులు ఫొటోలు దిగారు. కాగా, 2025–26 సంవత్సరానికి నిర్వహించిన సీఎం కప్ క్రీడాపోటీల్లో జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులు ఖో–ఖో, ఆర్చరీ, వెయిట్‌లిఫ్టింగ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చి బంగారు, వెండి పతకాలు సాధించిన విషయం తెలిసిందే.
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
తాండూర్: మండలంలోని ఐబీ ప్రాంతంలోగల శనివారం సంత సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బెల్లంపల్లి జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాల ప్ర కారం.. మండలంలోని చంద్రపల్లి గ్రామానికి చెందిన కంబాల బక్కయ్య (78) మంగళవారం రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీ కొ ని మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.


