ఆదిలాబాద్‌రూరల్: ఆదివాసీ పర్ధాన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా గేడం తులసీరాం (ఆదిలాబాద్), గౌరవ అధ్యక్షుడిగా కుర్సేంగే జంగు (మంచిర్యాల), ప్రధాన కార్యదర్శిగా ఆడ వెంకటేశ్ (కుమురం భీం ఆసిఫాబాద్), కోశాధికారిగా ఉయికే విఠల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా మడావి శంకర్, ఆడిటర్‌గా గేడం కృష్ణ, సాంస్కృతిక కార్యదర్శిగా తొడసం నాగోరావు, ఉపాధ్యక్షులుగా మనోహర్, గంగాసాగర్, అంజనాదేవి, గంగారాం, కుమ్ర శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా మడావి తిరుపతి, కుమ్ర గంగారం, ఆత్రం ప్రహ్లాద్, కుర్సేంగే మహేందర్, మడావి హరిప్రసాద్, కార్యనిర్వాహక సభ్యులుగా కోవా వినోద్, కోట్నాక భగవంతురావు, మెస్రం దేవరావు, కుర్సేంగే శంకర్, ఆడ సంపత్, సలహాదారుగా పుర్క ఉద్దవ్, మడావి గంగారాం, పూసం ఆనంద్ రావు, ఎన్నికయ్యారు.
108 సిబ్బందికి ఉత్తమ పురస్కారాలు
ఇచ్చోడ: మండలంలో 108 సిబ్బంది ఈఎంటీ ప్యాట అనిల్‌కుమార్, పైలట్ సింగారం వినోద్‌లకు రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారాలు లభించాయి. ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స అందజేసి సకాలంలో ఆస్పత్రులకు తరలించి పలువురు ప్రాణాలు కాపాడినందుకు హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారా లు అందజేశారు. రాష్ట్రస్థాయిలో ఇచ్చోడ సిబ్బంది పురస్కారాలు అందుకోవడంపై మండల ప్రజలు అభినందించారు.
ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 10 మంది అరెస్టు
ఇచ్చోడ: ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇచ్చోడ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ బండారి రాజు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఈమేరకు వివరాలు వెల్లడించారు. మండల కేంద్రంలోని ఎంప్లాయీస్ కాలనీకి చెందిన గొలుసుల విజయ్ తన స్నేహితులు మురళీ, జాదవ్ రాము, కాంబ్లే ఆకాష్, సిడాం రవి, కాంబ్లే రాజ్‌కుమార్, కాంబ్లే అరుణ్, దాసన్న దేవాల, కాంబ్లే శశికుమార్, సీపెల్లి శ్రీనివాస్ ద్వారా చిట్టీల రూపంలో బృందావన్‌కాలనీ ప్రాంతంలో సోమవారం ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని విజయ్‌తో పాటు బెట్టింగ్‌లో పాల్గొన్నవారిని అదుపులో తీసుకున్నారు. వారి నుంచి 3 బైక్‌లు, 9 సెల్‌ఫోన్లు, రూ.4470 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
కడుపునొప్పి భరించలేక వ్యక్తి..
సిర్పూర్(టి): కడుపునొప్పి భరించలేక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సాగర్ కథనం ప్రకారం.. మండలకేంద్రంలోని పాతట్లగూడ కాలనీకి చెందిన పర్శన శంకర్(59) గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి నొప్పి భరించలేక పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్సై సాగర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.


