నార్నూర్: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని తాడిహత్నూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కలవలే విజయ్ (38) వడదెబ్బతో ఆదివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ గ్రామంలో వ్యవసా య కూలీగా పనిచేస్తున్నాడు. వారం క్రితం మరికొందరితో కలిసి చేను పనినిమిత్తం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడికి వెళ్లాడు. అక్కడ పనులు చేస్తుండగా.. ఎండవేడిమితో శనివారం అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందా డు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


