ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
ఖానాపూర్: పల్లె అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలపై పాలకవర్గాలు దృష్టి సారించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ నూతన సర్పంచులకు సూచించారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు సమష్టిగా పనిచేసి గ్రామాలను ఉత్తమ పంచా యతీలుగా తీర్చిదిద్దాలన్నారు. మండలంలోని మ స్కాపూర్ సర్పంచ్ దొనికేని లక్ష్మి, తర్లపాడ్ సర్పంచ్ పొలంపెల్లి సచిన్‌ల ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోమవారం హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు దయానంద్, మాజిద్, తోట సత్యం, వెంకటేశ్, నర్సయ్య, తదితరులున్నారు.


