పార్కులో.. పఠనం
పఠనంపై ఆసక్తి పెంచేలా..
ప్రస్తుత రోజుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గి పోతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని మరో గ్రంథాలయ ఉద్యమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలు. చిన్నారులే కాకుండా పెద్దవారు ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు. ముఖ్యంగా పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. విజయవంతం అయితే మరిన్ని ప్రదేశాల్లో ముందుకు తీసుకువెళ్లేలా చర్యలు చేపడుతున్నాం.
– నూతుల రవీందర్‌రెడ్డి,
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి
సృజనాత్మకత.. ఊహాశక్తి పెంపు
మొబైల్ ఫోన్లు అధికంగా విని యోగించడం వలన విద్యార్థులు, చిన్నారులు స్వయంగా ఆలోచించలేకపోతున్నారు. ప్రతీ చిన్న విషయానికి ఇంటర్నెట్, ఫోన్లపై ఆధారపడుతున్నారు. దీంతో వారిలో సృజ నాత్మకత లోపిస్తోంది. ఆవిష్కరణలు తగ్గిపోతాయి. కానీ పుస్తక పఠనం వలన ఎన్నో నూతన విషయాలు తెలుస్తాయి. చిన్నారుల ఊహాశక్తి పెరుగుతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రతీ ఒక్కరిలో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించాలనే ధ్యేయంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం.
– పోరెడ్డి అశోక్, పాఠ్యపుస్తక రచయిత
ఆదిలాబాద్: శాస్త్ర సాంకేతిక అందుబాటులోకి రా వడంతో ప్రపంచమంతా అరచేతిలో వాలిపోయింది. చిన్నాపెద్ద అంతా మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. మరోవైపు విజ్ఞానమందించే పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గిపోతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరిలో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా జన విజ్ఞా న వేదిక, పలుస్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాయి. మరో గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. పబ్లిక్‌పార్కుల్లో పుస్తక ప్రదర్శన, పఠ న కార్యక్రమాన్ని నేటినుంచి షురూ చేస్తున్నాయి.
ప్రతీ నెలలో 4వ ఆదివారం..
ప్రతినెల నాలుగో ఆదివారం ఆదిలాబాద్ పట్టణ పరిధిలోని పబ్లిక్ పార్కుల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈకార్యక్రమం నిర్వహించనున్నారు. నేడు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నిర్వాహకులు పార్కుల్లో పుస్తక ప్రదర్శన చేస్తారు. ఔత్సాహికులు తమకు నచ్చిన పుస్తకాన్ని చదివే వెసులు బాటు కల్పించారు. అందరినీ అనుమతిస్తారు. ఔత్సాహికులు తమ సొంత పుస్తకాలు సైతం తీసుకొని రావచ్చు. వాటిని ప్రదర్శనగా ఉంచుతారు. అందరూ కలిసి కూర్చుని చదువుకోవడాన్ని ఒక సెషన్‌గా నిర్వహిస్తారు. పుస్తకాలు చది విన అనంతరం ఆసక్తి కలిగిన వారు ఆయా పుస్తకాల్లోని కవితలు చెప్పడం, గేయాలు పాడడం వంటివి చేయవచ్చు. అంతేకాకుండా అందులోని కథలను వారికి నచ్చిన భాగాన్ని చదివి వినిపించవచ్చు. అలాగే సృజనాత్మకంగా చెప్పేందుకు అవకాశం ఉంటుంది.
పార్కులో.. పఠనం
పార్కులో.. పఠనం
పార్కులో.. పఠనం


