పకడ్బందీగా ఎస్‌ఐఆర్ జాబితా
రుణాల దుర్వినియోగంపై కఠిన చర్యలు
కై లాస్‌నగర్: బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించా రు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ, ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో స్వ యం సహాయక మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, గ్రైండింగ్ యూని ట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందిరా మహిళాశక్తి బజార్ యూనిట్ల స్థాపనకు ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చే యాలన్నారు. సీ్త్రనిధి రుణాలను వంద శాతం రీపేమెంట్ చేయాలన్నారు. ఇందులో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, ఎల్‌డీఎం ఉత్పల్ కుమార్, ఏపీఎం, డీపీఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కైలాస్‌నగర్: ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పక్కాగా నిర్వహించి పారదర్శక జాబితా రూపొందించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శనివారం జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూ త్‌స్థాయి అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకా రం ఓటరు జాబితాలను కేటగిరీ వారీగా మ్యాపింగ్ కూడా పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రె యినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి, వివి ధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కిశోర బాలికలకు ఎస్‌హెచ్‌జీలు
కిశోర బాలికల సాధికారత, అభివృద్ధి కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘స్నేహ’ కార్యక్ర మ అమలుపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 15 నుంచి 18 ఏళ్ల యువతులను శక్తివంతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. యువతుల్లో సంపూర్ణ ఆరోగ్య అవగాహన,సరైన పోషకాహారం, సురక్షిత వాతావరణం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆర్థి కస్వావలంబనకు తోడ్పడుతుందన్నారు. అధికారులు గ్రామాల వారీగా నిర్దేశిత వయసు గల యువతులను గుర్తించి స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం స్నేహ బుక్‌ను ఆవిష్కరించారు.
రైతులకు నష్టం వాటిల్లకుండా పత్తి కొనుగోళ్లు
పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్ల కుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈనెల 27 నుంచి పత్తి కొనుగో ళ్లు ఉంటాయని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించేలా సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలిపారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా మాత్రమే కొనుగోళ్లు ఉంటాయని పే ర్కొన్నారు. సాంకేతిక అంశాలను పరీక్షించేందు కో సం మార్కెట్ యార్డులో ముందుగా ట్రయల్ రన్ నిర్వహించామని తెలిపారు. ఏఈవోల ఆధ్వర్యంలో 10మంది రైతులను ఎంపిక చేసి, వారి పత్తిని గ్రా మాల్లో ఆరబెట్టి తేమ శాతం 8నుంచి 12శాతం మధ్యగా నిర్ధారించారని పేర్కొన్నారు. 27నుంచి ప్రతిరోజు ఉదయం 9గంటలకు రైతులు, జిన్నింగ్ యజమానులు,సీసీఐప్రతినిధుల సమక్షంలో వేలం ద్వారా ప్రైవేట్ ధర నిర్ణయించబడుతుందని తెలి పారు. 27వరకు ఆదిలాబాద్ లోని ఏ, బీ కేంద్రాల్లో 252మంది స్లాట్ బుక్ చేసుకున్నారని పేర్కొన్నారు. అయితే కొందరు వాస్తవాలు తెలుసుకోకుండా వ్యా ఖ్యలు చేయడం సరికాదన్నారు. రైతులు ఆందోళన చెందకుండా నాణ్యమైన పత్తి ని యార్డుకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కోరారు.


