కొలిక్కి వచ్చినట్లేనా..? | - | Sakshi
Sakshi News home page

కొలిక్కి వచ్చినట్లేనా..?

Oct 26 2025 8:07 AM | Updated on Oct 26 2025 8:07 AM

కొలిక్కి వచ్చినట్లేనా..?

కొలిక్కి వచ్చినట్లేనా..?

తది దశకు డీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియ

ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో రాష్ట్ర నాయకుల సమావేశం

పరిశీలకుల నివేదికపై చర్చ

సాక్షి,ఆదిలాబాద్‌: రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టేనా అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతుంది. ఇటీవల పరిశీలకులు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. ఆ నివేదికను జాతీయ నాయకత్వానికి అందించారు. దీనిపై శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పాల్గొని ఏఐసీసీ పరిశీలకులతో నివేదికలపై చర్చించారు. మరికొద్ది రోజుల్లో అధ్యక్షుడి పేరు ఖరారవుతుందని పార్టీలో ప్రచారం సాగుతుంది.

క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ

ఇటీవల ఏఐసీసీ పరిశీలకుడు కర్నాటకకు చెందిన ఎమ్మెల్యే అజయ్‌ సింగ్‌ జిల్లాలో పర్యటించిన విష యం తెలిసిందే. రాష్ట్రానికి చెందిన పీసీసీ ప్రతినిధులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా అధ్యక్షుడి ఎంపిక విధానంలో జాతీయ నాయకత్వం సూచించిన విధంగా అభిప్రాయ సేకరణ చేశారు. జిల్లా నుంచి వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఆరుగురు నేతల పేర్లతో కూడిన నివేదికను అందజేశారు. ఢిల్లీలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఈ పేర్లపై రాష్ట్ర నేతలతో ఏఐసీసీ పరిశీలకులు చర్చించారు. ఆయా జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి.. ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి.. అనే అంశాలను రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వంతో చర్చించారు.

ఉమ్మడి జిల్లా ఆధారంగా..

జిల్లా నుంచి వివిధ సామాజికవర్గాలకు చెందిన ఆరుగురు నేతల పేర్లు సూచించినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఆయా సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సమతూకం పాటించాలని పార్టీ భావిస్తోంది. ఓ జిల్లాలో ఓసీకి కేటాయిస్తే, మిగతా జిల్లాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇందులో మహిళా ప్రాతినిధ్యాన్ని కూడా పరిశీలిస్తారని అభిప్రాయ పడుతున్నారు. మొత్తంగా ఢిల్లీలో ఈ ప్రక్రియపై చర్చించి ఆయా జిల్లాల వారీగా పేర్లను ఖరారు చేసి వీలైతే ఈనెల చివరిలోగా లేనిపక్షంలో నవంబర్‌ మొదటి వారంలో డీసీసీ అధ్యక్షులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఐదేళ్ల ప్రాతినిధ్యం..

డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో పార్టీ జాతీయ నాయకత్వం దేశ వ్యాప్తంగా ఒకే నియమావళిని అనుసరిస్తుందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆ పద్ధతిలోనే అధ్యక్షుల ఎంపిక జరిగిందని చెప్పుకుంటున్నారు. పార్టీలో కనీసం ఐదేళ్ల ప్రాతినిధ్యం ఉన్న వారికే అధ్యక్షుడి హోదా కల్పిస్తున్నారని, ఈ విషయంలో పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా పరిశీలన చేస్తుందని అంటున్నారు. ఒక వేళ ఇదే జరిగితే పార్టీలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చేరిన పలువురు నాయకుల ఆశలపై నీళ్లు చల్లే పరిస్థితి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement