కడ్డోడి శివారులో పులి సంచారం
నార్నూర్: మహారాష్ట్ర సరిహద్దు గాదిగూడ మండలం కడ్డోడి గ్రామ శివారులో పులి సంచరించి నాలు గు పశువులపై దాడి చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కడ్డోడి గ్రామానికి చెందిన గెడం తులసీరామ్‌కు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో వ్యవసాయ భూమి ఉంది. రోజూ మా దిరి శనివారం ఉదయం పశువులను మేపేందుకు చేనుకు వెళ్లాడు. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చిన పులి ఆకస్మికంగా పశువులపై దాడి చేసింది. పులిని చూసిన తులసీరామ్ భయంతో పరుగు తీశాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు వెళ్లి చూడగా మూడు ఆవులు, ఒక దూడపై పులి దాడి చేసింది. విషయం తెలుసుకున్న మహా రాష్ట్ర, తెలంగాణ అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పులి ఆనవాళ్లు కనిపించడంతో దానిని గుర్తించేందుకు మహారాష్ట్ర, తెలంగాణ అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు అమర్చారు. ఇందులో అధికారులు సుదర్శన్, శంకర్, తదితరులున్నారు. కాగా పులి దాడిలో నాలుగు పశువులు మృతి చెందడంతో బాధిత రైతును ఆదుకోవాలని ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందూరు సంతోష్ డిమాండ్ చేశారు.
కడ్డోడి శివారులో పులి సంచారం


