విద్యార్థుల హాజరుశాతం పెంచాలి
బజార్‌హత్నూర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచాలని డీఐ ఈవో జాదవ్ గణేశ్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివా రం తనిఖీ చేశారు. రిజిస్టర్లతో పాటు కళాశాలలో రూ.15లక్షల నిధులతో చేపట్టిన మరమ్మ తు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ మోహసిన్, ప్రిన్సి పాల్ సునిల్, అధ్యాపకులు పాల్గొన్నారు.
నేరడిగొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈవో తనఖీ చేశా రు. విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించారు. హాజరుశాతం పెంచాలని అధ్యాపకుల కు సూచించారు. ఇందులో ప్రిన్సిపాల్ శబానా తరన్నమ్, సూపరింటెండెంట్ షేక్ మోసిన్, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు.


