విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ఉట్నూర్‌రూరల్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి షఫీఉల్లా అన్నారు. మండల కేంద్రంలోని మైనార్టీ గురుకులంను శనివారం తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందించాలన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల గోడలకు పేయింట్, అలాగే ప్రహరీ లేక పోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ ప్రసాద్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.


