గడువు పెంచినా నామమాత్రమే..
ఆదిలాబాద్‌టౌన్: మద్యం షాపుల దరఖాస్తు ప్ర క్రియ గురువారం ముగిసింది. ప్రభుత్వం గడువు పెంచినా దరఖాస్తుదారులు అంతగా ఆసక్తి చూపలేదు. జిల్లాలోని మద్యం షాపులకు 37 దరఖాస్తులు రాగా, హైదరాబాద్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో 19 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా జి ల్లాలోని 40షాపులకు గాను 767 దరఖాస్తులు వచ్చి నట్లు ఎకై ్సజ్‌శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 27 న లక్కీడ్రా ద్వారా షాపులు కేటాయించనుండగా అంతా ఆసక్తిగా చూస్తున్నారు. డిసెంబర్ 1నుంచి 2025–27 మద్యం పాలసీ ప్రారంభం కానుంది.
దరఖాస్తు ఫీజు పెంచడంతోనే..
మద్యం షాపుల దరఖాస్తు ఫీజు రూ.3లక్షలకు పెంచడంతోనే ఈసారి తక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. గతనెల 26నుంచి ఈనెల 18వరకు 711 దరఖాస్తులు రాగా, ప్రభుత్వం ఈనెల 23వరకు గడువు పెంచింది. గడువు పెంచిన తర్వాత 56 దరఖాస్తులు వచ్చాయి. 2023లో దరఖాస్తుల ద్వా రా ప్రభుత్వానికి రూ.20కోట్ల వరకు రాగా, ఈసారి రూ.23 కోట్ల వరకు వచ్చింది. గతం కంటే ఈ సారి 280 దరఖాస్తులు తక్కువగా వచ్చినా ఆదాయం మరో రూ.3కోట్లు అదనంగా రావడం గమనార్హం. పది కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన షాపులకు మళ్లీ రీటెండర్ వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, గడువు పెంచిన తర్వాత ఆదిలాబాద్ స్టేషన్ పరిధిలో 24 దరఖాస్తులు, ఇచ్చోడ స్టేషన్ పరిధిలో 10, ఉట్నూర్ స్టేషన్ పరిధిలో మూడు దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ కమిషనరేట్‌లో మద్యం షాపులకు సంబంధించి 19 దరఖాస్తులు రాగా, వీటిలో ఆదిలాబాద్‌కు ఆరు, ఇచ్చోడకు ఎనిమిది, ఉట్నూర్‌కు ఐదు దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి హిమశ్రీ, ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ విజేందర్ తెలిపారు. మొత్తంగా ఆదిలాబాద్ స్టేషన్ పరిధిలో 420 దరఖాస్తులు, ఇచ్చోడ స్టేషన్ పరిధిలో 201, ఉట్నూర్ స్టేషన్ పరిధిలో 127 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.


