రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలి
ఆదిలాబాద్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటలని డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టే డియంలో గురువారం జోనల్ లెవెల్ ఎస్జీఎఫ్ జూ డో ఎంపిక పోటీలను డీటీఎస్వో పార్థసారథితో కలి సి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. జిల్లా క్రీడాకారులు అందుబాటులోని సదుపాయాలను వినియోగించుకుని కోచ్ రాజు పర్యవేక్షణలో పతకాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆడే రామేశ్వర్, మాట్లాడు తూ.. జిల్లాస్థాయి యోగా ఎంపిక పోటీలను నవంబర్ మొదటి వారంలో నిర్వహిస్తామని తెలిపారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, జూడో కోచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.


