అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
ఆదిలాబాద్‌టౌన్: అమర పోలీసుల త్యాగాల ఫలి తమే జిల్లా ప్రశాంత వాతావరణానికి కారణమని, వారి త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి స్పందన లభించింది. 817 మంది పోలీసులు, ప్రజలు, ఔత్సాహికులు రక్తదానం చేశారు. రిమ్స్ బ్లడ్ బ్యాంక్ వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా రక్తదానం చేసి సిబ్బందికి స్ఫూర్తిగా నిలిచారు. రక్తదానం మహోన్నతమైనదని అన్నారు. రక్తదానం చేసిన ప్రతీ ఒక్కరికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్‌రావు, రిమ్స్ డైరెక్టర్ జయ్‌సింగ్ రాథోడ్, డీఎస్పీలు ఎల్. జీవన్‌రెడ్డి, పోతారం శ్రీనివాస్, కమతం ఇంద్రవర్ధన్, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.


