రైతులు అధైర్యపడొద్దు
ఎఫెక్ట్..
సిరికొండ: రైతులు అధైర్యపడొద్దని, ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి మక్కలు తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ తీరును వివరిస్తూ ‘సాక్షి’లో ‘కురిసిన వర్షం.. తడిసిన పంటలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అదనపు కలెక్టర్ స్పందించారు. తడిసిన మక్కలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అధైర్యపడొద్దని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రతీ గింజను కోనుగోలు చేస్తుందని ధైర్యం చెప్పారు. ఆమె వెంట తహసీల్దార్ తుకారాం, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
రైతులు అధైర్యపడొద్దు


