● మన పిల్లలకు ఈడనే నౌకర్లొస్తయ్‌.. ● యూనివర్సిటీ వస్తే లాభాలెన్నో.. ● విశ్వవిద్యాలయ సాధనపై ‘మహిళల ముచ్చట’ | - | Sakshi
Sakshi News home page

● మన పిల్లలకు ఈడనే నౌకర్లొస్తయ్‌.. ● యూనివర్సిటీ వస్తే లాభాలెన్నో.. ● విశ్వవిద్యాలయ సాధనపై ‘మహిళల ముచ్చట’

Jul 20 2025 5:58 AM | Updated on Jul 20 2025 3:05 PM

● మన పిల్లలకు ఈడనే నౌకర్లొస్తయ్‌.. ● యూనివర్సిటీ వస్తే

● మన పిల్లలకు ఈడనే నౌకర్లొస్తయ్‌.. ● యూనివర్సిటీ వస్తే

జంగుబాయి: అవ్‌ యూనివర్సిటీ అంటే పెద్ద స దువులు ఉంటయంటున్నవ్‌.. దానికి తగ్గట్టు బి ల్డింగ్‌లు ఉండొద్దా మరి. అవి మనకాడ కడ్తరా.. ఈడ సౌలత్‌లున్నయా.. ప్రభుత్వం సాంక్షన్‌ చేస్తదా..?

లక్ష్మి: గట్ల అంటవ్‌ ఏందక్క. మనకేం తక్క. మనకాడ ఎంతో పెద్ద జంగల్‌ ఉన్నది.. నేషనల్‌ హై వే 44 మన జిల్లా మీదికించే పోతది. ఎయిర్‌పోర్టు కూడా కట్టతందుకు మొన్న కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందట. అది కాకుండా వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్‌ల రిమ్స్‌ దవాఖాన కట్టలేదా. ప్రభుత్వాలు తలు చుకుంటే విద్యాసంస్థలు ఎందుకు కట్టరు? తప్పకుండా కడతరు. చదువులు కూడా చెప్తరు.

సరస్వతి: ఏండ్ల సంది మన ఎదులాపురంను ఎనకబడ్డ జిల్లా అనుకుంటా మొత్తానికే ఎనకపడేసిండ్రు. ఇప్పుడు యూనివర్సిటీ పెడతరంటవా..?

జంగుబాయి: అవ్‌ సరస్వతక్క సెప్పింది కూడా నిజమే అనిపస్తంది. సాధ్యమైతదంటవా..

లక్ష్మి: ఎనకబడ్డ ఇలాఖాల్లోనే విద్య అవసరం ఎంతో ఉంటది. అందుకే సర్కారోళ్లు కూడా నజర్‌పెట్టి పెద్ద విద్యాసంస్థలు పెట్టేందుకు చూస్తరు. తెలంగాణల ఉమ్మడి పది జిల్లాలను చూస్తే దాదాపు ప్రతీ జిల్లాల యూనివర్సిటీ ఉన్నది. ఒక్క మన ఆదిలాబాద్‌ల తప్ప. ‘సాక్షి’ పేపరోళ్లు పెట్టిన మీటింగ్‌ ద్వారా ఏర్పటైన కమిటీ ప్రభుత్వం దగ్గరికి విషయం తీసుకుపోయేందుకు రెడీ అయిందట. పార్టీలకతీతంగా అంద రూ కలిసి పోతున్నరట. సాంక్షన్‌ అయితే మన పిలగాండ్లు ఈడ్నే చదువుకొని మంచి కొలువులు చేస్తరు.

జంగుబాయి: యూనివర్సిటీ కడితే చదువు చెప్పు డే కాకుండా నౌకర్లు కూడా ఇస్తరా అక్క?

లక్ష్మి: యూనివర్సిటీ వస్తే వేల సంఖ్యలో పిలగాండ్లు పట్టభద్రులైతరు. మామూలు డిగ్రీలే కాకుండా ప్రొఫెషనల్‌ పట్టాలు కూడా పొందుతరు. బయట దేశాలకు కూడా పోతరు. ఇప్పుడు మన రిమ్స్‌ మెడికల్‌ కాలేజీలో పిలగాండ్లు ఎంబీబీఎస్‌ చదువుతలేరా గట్లనే. ఇంజినీరింగ్‌, లా, పీజీ, పీహెచ్‌డీ వంటి పెద్ద పెద్ద చదువులు మన పిల్లలు చదువుతరు. హైదరాబాద్‌ల ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ లెక్క అన్నమాట.

సరస్వతి: గట్లాంటప్పుడు ఇప్పటిదాకా యూనివర్సిటీ ఎందుకు కట్టలే. అది ఉంటే మన పిల్లలు అంత దూరం పోయి వాళ్లు తిప్పలపడకపోవు.. మనం కూడా బాధపడకపోవు కదా!

లక్ష్మి: మనం మాత్రం అనుకుంటేనే అయితదా వదినే! మన పిలగాండ్లు గట్టిగా అనుకోవాలి. అట్లనే విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మీడియా ఇలా ప్రతి ఒక్కళ్లు గట్టిగా సర్కారును అడిగితే గప్పుడు యూనివర్సిటీ బరాబర్‌ అస్తది.

సరస్వతి: అవ్‌ లక్ష్మి నువ్వన్న దాంట్లో కూడా తప్పులేదు. అందరూ గట్టిగా అనుకొని రోడ్లమీ దకి వస్తేనే మన తెలంగాణ అచ్చింది. గట్లనే యూ నివర్సిటీ కూడా వస్తది. నువ్వు కూడా ఏదో డిగ్రీ చదివిన అంటివి? పీజీల సీటొస్తే మీఓళ్లు దూరమైతదని వరంగల్‌ పంపలే అంటివి. నువ్వు గిట్ల చదివితే మంచి నౌకరిస్తుండే.

లక్ష్మి: అన్నీ మనకు అనుకున్నట్లు జరుగుతాయా వదిన. తల్లిదండ్రులకు కూడా భయం ఉంటది కదా. అందులోనూ ఆడపిల్లల విషయంలో గు బులు ఎక్కువ. అదే మన జిల్లాలోనే యూనివర్సిటీ వస్తే ముఖ్యంగా ఆడపిల్లలు సక్కగా చదువుకోడానికి సౌలత్‌ అయితది.

సరస్వతి: మా అప్పుడు గిన్ని సదువులు చెప్పే బడులు లేకుండే లక్ష్మి. ఉన్నవడితే నేను సదివేదాన్ని. సిన్నగున్నపుడే లగ్గం జేసీ పగ్గం మీ అన్నకు ఇచ్చిరి.

లక్ష్మి: ఇప్పుడు రోజులు మారినయ్‌. ఆడపిల్లలకు జల్ది లగ్గం అంటే ఆలోచిస్తున్నరు. అయిన గని మారుమూల ప్రాంతాల్లో పెండ్లిళ్లు చేస్తుండ్రు. అవి ఆగాలన్నా.. మనం గొప్పగా ఎదగాలన్నా చదువుతూనే అయితది. మనకు విశ్వవిద్యాలయం వస్తేనే మార్పు వస్తది. మనం కూడా మన పిల్లలకు ఇమ్మత్‌ ఇయ్యాలే. యూనివర్సిటీ వచ్చేదాకా కొట్లాడాలి.

జంగుబాయి: నా పిల్లగాండ్లు, నీ పిల్లగాండ్లు పెద్దగయ్యేవరకు మనకు ఈడ యూనివర్సిటీ ఉంటే సక్కగా సదువుకుని, మన కండ్ల ముందే నౌకర్‌ చేస్తరు. వాళ్ల కోసం అయినా మనం కూడా కోట్లాడాలె. నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడొస్తా.

సరస్వతి: లక్ష్మి, జంగు.. మీతో పాటు నేను కూడా వస్తా.. పోరాటం చేస్తా..

అయ్యో పొయ్యిమీద అన్నంపెట్టి నంటినవ్‌ వదిన.. మాడు వాసన వస్తంది. చూడుపో.. అనగానే సరస్వతి అయ్యో నేను మరిచే పోయి న అంటూ గ్యాస్‌ కాడికి వెళ్లడంతో మిగతా ఇద్దరూ ఎవరింటికి వారు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement