
ఆదిశంకర ధ్యాన మందిరానికి బౌద్ధ గురువులు
నెల్లూరు(బృందావనం): పొగతోటలోని చక్రాల వారి ట్రస్ట్ ఆదిశంకర ధ్యాన మందిరానికి బౌద్ధగురువులు కోవానే పాలితథెరో (శ్రీలంక), షిమాడా యూషి (జపాన్) బోధిహీన్ మంగళవారం విచ్చేశారు. ఆదిశంకర భగవత్పాదులును దర్శించుకున్నారు. అనంతరం వీరిని సత్కరించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చక్రాల ఆనంద్‌కుమార్, ఇందుకూరుపేట లలితా భరద్వాజ దత్తాశ్రమ పీఠాధిపతి రామాయణం మహేష్‌స్వామి, మందిర మేనేజర్ స్వామి సమయానందనాథ, రామాయణం మణిశంకర్, తంగిరాల వెంకటశ్రీకాంత్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
అన్నదానం
పొగతోటలోని చక్రాల వారి ట్రస్ట్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పాత మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో గల పట్టణ నిరాశ్రయులు, వృద్ధుల కేంద్రం, పంచవటి ఆశ్రమంలో అన్నదానాన్ని నిర్వహించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చక్రాల ఆనంద్‌కుమార్, పంచవటి ఆశ్రమ పీఠాధిపతి ఆత్మానందగిరి, నిరాశ్రయుల కేంద్ర నిర్వాహకుడు దాసరి సుందరం, చక్రాల వారి ట్రస్ట్ నిర్వాహకుడు చక్రాల వెంకట లక్ష్మీనరసింహం, మైపాడు రాజాశర్మ, అన్నవరం సత్యనారాయణమూర్తి, పామర్తి వెంకటలీలామోహన్, ములుమూడి ఉదయ్‌కుమార్, శ్రీహరిప్రసాద్‌రావు, మల్లవరపు లక్ష్మీనరసింహరావు తదితరులు పాల్గొన్నారు.