
శాసీ్త్రయ సమాజానికి కృషి
నెల్లూరు(అర్బన్): మూఢ నమ్మకాల్లేని శాసీ్త్రయ సమాజం.. సైన్స్ ఫలాలు సామాన్యులందరికీ దక్కాలనే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక కృషి చేస్తోందని వేదిక రాష్ట్ర నూతన అధ్యక్షుడు శ్రీనివాసులు పేర్కొన్నారు. నగరంలోని బాలకోటేశ్వరరావు ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ అభినందన సమావేశంలో జేవీవీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గౌస్‌బాషా, డాక్టర్ బాలకోటేశ్వరరావు మాట్లాడారు. ఉపాధ్యాయుడిగా ఉంటూ.. తన ఖాళీ సమాయాన్ని వెచ్చిస్తూ జేవీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైన్స్ ఉద్యమాల్లో శ్రీనివాసులు చురుకై న పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. అనంతరం ఆయనతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లా నుంచి ఎన్నికై న చక్రపాణి, రాష్ట్ర సలహా మండలి సభ్యుడు శేషారెడ్డి, కార్యదర్శి గీతాంజలిని సన్మానించారు.