
పక్కాగా రక్త పరీక్షలు
నెల్లూరు(అర్బన్): సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు గానూ రక్త పరీక్షలను ల్యాబ్ టెక్నీషియన్లు పక్కాగా నిర్వహించాలని జిల్లా మలేరియా నివారణాధికారి హుస్సేనమ్మ పేర్కొన్నారు. నగరంలోని పీసీ నాయుడి వీధి, జాకీర్‌హుస్సేన్‌నగర్‌లో గల పట్టణ ఆరోగ్య కేంద్రాలను మంగళవారం తనిఖీ చేశారు. ల్యాబ్ రిజిస్టర్లను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. జ్వరాలు నమోదవుతున్న ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు తక్షణమే స్పందించి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ టెక్నీషియన్లకు సకాలంలో చేర్చాలని కోరారు. నూతనంగా రూపొందించిన రిజిస్టర్లను నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది కరుణమ్మ, గురవయ్య, సంజీవకుమార్, ఆరోగ్య పర్యవేక్షకురాలు గిరిజావతి తదితరులు పాల్గొన్నారు.