
గుండె వ్యాధి నివారణ మాత్రల అందజేత
నెల్లూరు(బృందావనం): పొదలకూరు రోడ్డులోని జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో వాకర్స్‌కు గుండె వ్యాధి నివారణ మాత్రలను జెడ్పీ వాకర్స్ సంఘం, శుభమస్తు షాపింగ్‌మాల్ సౌజన్యంతో మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ – 203 ఎలక్ట్ గవర్నర్ నలుబోలు బలరామయ్యనాయుడు, సంగీత విద్వాంసురాలు వేదాంతం హర్షవర్ధినిని సత్కరించారు. జెడ్పీ వాకర్స్ సంఘ గౌరవాధ్యక్షుడు మెట్టు సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి ఖాజామస్తాన్, కోశాధికారి వెంకటరమణయ్య, చెంచయ్య, రాజగోపాల్, ప్రసాద్, ఎస్తేరు రాణి, మేరీ బ్లెస్సింగ్టన్, మెట్టు సృజన, ప్రసాద్, వీరగంధం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.