వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి
తలమడుగు: రైతులు సాగులో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని సుంకిడి గ్రామ రైతు వేదికలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. నేల ఏ పంటకు అనుకూలమో వాటినే సాగు చేయాలన్నారు. పంట మార్పిడితో అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పిడుగులు పడుతున్నాయని, ఈ విషయంలో ముందస్తు జాగ్రతలు పాటించాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గణేశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రాజేశ్వర్, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.


