ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
కై లాస్‌నగర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బేస్మెంట్ దశ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు తక్షణమే నగదు చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు. బేస్మెంట్ ఏరియా 400 స్క్వేర్ ఫీట్స్ కంటే ఎక్కువ గాని, తక్కువ గాని ఉండకూడదని, సిమెంట్ ఇటుకలతో నే గోడలు నిర్మించుకోవాలని సూచించారు. స్థానిక ఇటుకలను నిర్మాణాలకు వాడకూడదని తెలిపారు. నిరుపేద లబ్ధిదారులు బేస్మెంట్ నిర్మించుకునేందుకు ఎస్‌హెచ్‌జీల ద్వారా ఆర్థికసాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఆదిశగా చర్యలు చేపట్టాలని డీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ నెలాఖరు వరకు 20 నుంచి 30 బేస్మెంట్లు నిర్మించాలని, వాటి ఫొటోలను అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణ డబ్బులు నాలుగు విడతల్లో మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రారంభం కాని చోట్ల వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని, మేసీ్త్రలను నియమించుకుని వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. మోడల్ విలేజ్ నిర్మాణ పనులను జూన్ 30లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఆదిలాబాద్‌టౌన్: టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సులో వేసవిలో శిక్షణ పొందేందుకు ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 17నుంచి 29వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో మే 1నుంచి 11వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు bse.telangana.gov.inలో లేదా డీఈవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
బాధ్యతల స్వీకరణ
ఆదిలాబాద్‌రూరల్: జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి (డీఎండబ్ల్యూవో)గా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్‌రావ్ శుక్రవారం జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు నుంచి అదనపు బాధ్యతలు తీసుకున్నారు. కార్యాలయ ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.


