
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్: ఇటీవల కురిసిన అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎదుట బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ మాట్లాడుతూ రైతులు పడ్డ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే తమను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. రైతులందరికీ న్యా యం చేసేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా పట్టణంలోని కొమరం భీం కాలనీలో నివసిస్తున్న ఆది వాసీలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అసెంబ్లీలో మాట్లాడారు. నిరసనలో ఎమ్మెల్యేలు పా ల్వాయి హరీశ్‌బాబు, వెంకటరమణారెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, రామారావు పటేల్ పాల్గొన్నారు.
నీటి వనరుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు పంపండి
కై లాస్‌నగర్: నీతి ఆయోగ్ ఆకాంక్షాత్మక బ్లాక్‌గా ఎంపిక చేసిన నార్నూర్ మండలంలో నీటి వనరుల పునరుద్ధరణకు అవసరమై ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని ఆ సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ యుగల్ జోషి సూచించారు. సోమవారం న్యూఢిల్లీ నుంచి నీటి వనరుల పునరుజ్జీవనం అమలుపై గుర్తించబడ్డ ఆకాంక్షాత్మక బ్లాక్‌ల జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. చెరువుల్లో పూడికతీతతో నీటినిల్వలు పెరిగి, భూగర్భజలాల అభివృద్ధితోపాటు చెరువుల పరిధిలోని ఆయకట్టు సాగుకు నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ దిశగా ఆకాంక్షాత్మక బ్లాకులల్లో ఏటీఈ చంద్ర ఫౌండేషన్ సాయంతో నీటి వనరుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టనుందన్నారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో వినోద్‌కుమార్ పాల్గొన్నారు.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి