ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ క్రీడా పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పోటీల్లో అండర్–16 విభాగంలో జావెలిన్‌త్రోలో వి.మహేశ్ బంగారు పతకంతో మెరిశాడు. అలాగే అండర్–14 విభాగంలో పి.రితిక జావెలిన్ త్రోలో రజత పతకం సాధించినట్లు కోచ్ రమేశ్ తెలిపాడు.
స్వర్ణంతో మెరిసిన కుశవర్తి జాదవ్
జిల్లాకు చెంది న అథ్లెట్ జాదవ్ కుశవర్తి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చా టింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో అండర్–20 విభాగంలో జావెలిన్‌త్రోలో స్వర్ణ పతకంతో మెరిసింది. ఆమె వెంట కోచ్ సౌమ్య, మేనేజర్ అనిల్ ఉన్నారు.
‘స్పోర్ట్స్’ విద్యార్థుల ప్రతిభ
‘స్పోర్ట్స్’ విద్యార్థుల ప్రతిభ