సీసీఐ పునరుద్ధరణపై ప్రకటన చేయించాలి | - | Sakshi
Sakshi News home page

సీసీఐ పునరుద్ధరణపై ప్రకటన చేయించాలి

Mar 20 2025 1:57 AM | Updated on Mar 20 2025 1:51 AM

కై లాస్‌నగర్‌: జిల్లా అభివృద్ధిపై స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సీసీఐ పునరుద్ధరణపై ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర పరి శ్రమలశాఖ మంత్రితో స్పష్టమైన ప్రకటన చేయించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్‌ చేశా రు. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని, అలాగే యంత్రాలను తుక్కు కింద విక్రయించే ఈ టెండర్‌ ప్రక్రియను వెనక్కి తీ సుకోవాలనే డిమాండ్‌తో సీసీఐ సాధనకమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట రిలేదీక్షలు చే పట్టారు. ఈ సందర్భంగా ఆయ న హాజరై దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సీసీఐ పునరుద్ధరణకు అన్ని విధాలా ప్రయత్నం చేశానన్నారు. ప్రస్తుత ఎంపీ నగేశ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లి అప్పటి పరిశ్రమలశాఖ మంత్రి అనంత్‌ గితేను ప లుమార్లు కలిసి విన్నవించానన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న స్థానిక ఎమ్మెల్యే శంకర్‌ ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీసీఐ అంశాన్ని ప్ర స్తావించాలని డిమాండ్‌ చేశారు. ఇందులో టీఎన్జీ వోస్‌ జిల్లా అధ్యక్షుడు అశోక్‌, సాధన కమిటీ సభ్యులు నారాయణ,ప్రభాకర్‌రెడ్డి,మల్లేశ్‌, దేవేందర్‌, పో శెట్టి, రామయ్య, ప్రేమల,మహేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement