తండ్రిపై దాడికి సుపారీ.. | - | Sakshi
Sakshi News home page

తండ్రిపై దాడికి సుపారీ..

Mar 16 2025 12:34 AM | Updated on Mar 16 2025 12:31 AM

● స్నేహితుడికి రూ.50 వేలు ఇచ్చిన కొడుకు ● దాడిచేసి గొలుసు ఎత్తుకెళ్లిన దుండగులు ● 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): తండ్రి, కొడుకు మధ్య కొన్ని రోజులుగా తలెత్తిన గొడవ చివరకు దాడి దారితీసింది. తండ్రి గొడవతో విసిగిపోయిన కొడుకు దాడి చేయించేందుకు స్నేహితుడికి సుపారీ ఇచ్చాడు. సుపారీ తీసుకున్న స్నేహితుడు దుండగులతో దాడి చేయించడంతోపాటు బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వేంపల్లిలో జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లో కేసును ఛేదించారు. మంచిర్యాల రూరల్‌ సీఐ అశోక్‌, హాజీపూర్‌ ఎస్సై సురేశ్‌ హాజీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం వివరాలు వెల్లడించారు. వేంపల్లికి చెందిన నాగిరెడ్డి సత్యానందం–సరస్వతి దంపతులకు కొడుకు రమేశ్‌ ఉన్నాడు. దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజులుగా తండ్రి, కొడుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రమేశ్‌ తండ్రిపై దాడి చేయించేందుక అతని స్నేహితుడు సొల్లు అవినాశ్‌కు రూ.50 వేల సుపారీ ఇచ్చాడు. దీంతో అవినాష్‌ గర్మిళ్లకు చెందిన అందె అశోక్‌, అట్ల సంతోష్‌, ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన మామిడిపల్లి చందు, చింతల కృష్ణతో కలిసి దాడికి ప్లాన్‌ చేశాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం సత్యానందర్‌ ఇంట్లో ఉండగా దాడి చేయించాడు. అంతేకాకుండా అతని మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. దీంతో బాధితుడు సాయంత్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు.

కొడుకుపై అనుమానంతో..

ఈ క్రమంలో కొడుకుపై అనుమానం రావడంతో అతడిని విచారణ చేశారు. దీంతో జరిగిన విషయం చెప్పాడు. దీంతో పోలీసులు అవినాశ్‌తోపాటు అశోక్‌, సంతోష్‌, చందు, కృష్ణను కూడా అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల్లో దాడి కేసును ఛేదించారు. అయితే విచారణలో రమేశ్‌ చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్‌కు గురయ్యారు. కేవలం కుటుంబ కలహాలతో కన్న తండ్రిపైనే దాడికి సుపారి ఇచ్చినట్లు రమేశ్‌ పోలీసులకు తెలిపాడు. నిందితుల నుంచి తులం బంగారు గొలుసు, సుపారీ కింద ఇచ్చిన రూ.30,670 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో కేసు ఛేదించిన మంచిర్యాల రూరల్‌ సీఐ ఆశోక్‌, హాజీపూర్‌ ఎస్సై సురేశ్‌, సీసీసీ ఎస్సై సుగుణాకర్‌, ఏఎస్సై ఎజాజ్‌, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్‌, నరేందర్‌, ఎస్‌కే.పాషాను సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా, డీసీపీ భాస్కర్‌, ఏసీపీ ప్రకాశ్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement