● అవగాహనతోనే హక్కుల రక్షణ ● ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ మోసాలే ● అప్రమత్తతే శ్రీరామరక్ష ● నేడు అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

● అవగాహనతోనే హక్కుల రక్షణ ● ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ మోసాలే ● అప్రమత్తతే శ్రీరామరక్ష ● నేడు అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం

Mar 15 2025 12:19 AM | Updated on Mar 15 2025 12:20 AM

ఇచ్చోడ మండలంలోని అడెగామకు చెందిన అల్లూరి వెంకట్‌రెడ్డి స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో రూ.10లక్షల విలువ గల ఇన్సూరెన్స్‌కు సంబంధించి రూ.33,866 చెల్లించాడు. తన భార్య భుజానికి గాయమైంది. ఈ మేరకు సదరు ఇన్సూరెన్స్‌ కంపెనీని సంప్రదించగా న్యాయం జరగలేదు. దీంతో ఆయన కన్జుమర్‌ కమిషన్‌ను ఆశ్రయించాడు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష 81వేలను 9 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని, అలాగే రూ.10వేల పరిహారం, రూ.5వేలు ఖర్చులకు ఇప్పించారు.

నష్టపోతే వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాలి

వినియోగదారులకు న్యాయం చేయడమే కన్జుమర్‌ కమిషన్‌ ముఖ్య ఉద్దేశం. వస్తువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా ఒరిజినల్‌ బిల్లు తీసుకోవాలి. 2018 నుంచి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 1100 కేసులను పరిష్కరించడం జరిగింది. కన్జుమర్‌ కమిషన్‌ ద్వారా రియల్‌ ఎస్టేట్‌ కేసులు, ఇన్సూరెన్స్‌, మెడికల్‌ లీగల్‌ కేసులు, విద్యుత్‌ శాఖ, చిట్‌ఫండ్స్‌, సీడ్స్‌, వస్తువులు తదితర వాటికి సంబంధించి మోసపోతే నేరుగా సంప్రదించవచ్చు. 90 రోజుల్లో కేసుల పరిష్కారం కోసం చర్యలు చేపడతాం. నష్టపోయిన బాధితులకు పరిహారం ఇప్పించేలా చూస్తాం. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో కేసుల పరిష్కారం కోసం బెంచ్‌ నిర్వహించడం జరుగుతుంది.

– జాబేజ్‌ శ్యాముల్‌, డీసీడీఆర్‌సీ ప్రెసిడెంట్‌

ఆదిలాబాద్‌టౌన్‌: కష్టపడి సంపాదించిన డబ్బు తో కొన్న వస్తువు సరిగ్గా పనిచేయకపోవడం, సంస్థలు అందించే సేవల్లో లోపాలతో వినియోగదారులు తీ వ్రంగా నష్టపోతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నా యి. వస్తువులు, సరుకులు కొనుగోలు చేసే సమయంలో అవగాహన లోపం, సేవలు పొందడం తెలియక చాలామంది వినియోగదారులు మోసాలకు గురవ్వాల్సి వస్తోంది. చాలా సంస్థలు నైతిక విలువలు వదిలేసి నాసిరకం వస్తువులు, సరుకులు తయారు చేసి వినియోగదారులకు అంటగడుతున్నారు. వినియోగదారుల ప్రయోజనాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. దీన్ని నివారించేందుకు కేంద్రం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇదివరకు ఏ వస్తువునైనా షాపులోకి వెళ్లి నేరుగా కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో మోసాలు సైతం మరింతగా పెరిగిపోతున్నాయి. హక్కులను మరింతగా రక్షించేందుకు కన్జుమర్‌ కమిషన్‌ కీలకపాత్ర పోషి స్తుంది. వేల కేసుల పరిష్కారానికి చొరవ చూపింది. నష్టపోయినదానికంటే అధికంగా పరిహారం అందించి బాధితులకు అండగా నిలిచింది. నేడు అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

అవగాహనే శ్రీరామ రక్ష..

ప్రజల శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చినా అవగాహన లేమితో అవి మెరుగైన ఫలితాలను సాధించడం లేదు. ప్ర స్తుత సాంకేతిక యుగంలోనూ ఎందరో వినియోగదారులకు తమ హక్కులపై సరైన చైతన్యం లేకుండా పోయింది. తమకు జరిగిన అన్యాయంపై కనీ సం ఫిర్యాదుసైతం చేయకుండా పోతున్నారు. నచ్చి న వస్తువుల సేవలు ఎంచుకోవడంతో పాటు వాటి నాణ్యత, పనితీరు గురించి తెలుసుకోవడం, అభిప్రాయం తెలియజేయడం తదితర హక్కులు విని యోగదారులకు ఉంటాయి. వస్తుసేవల విషయంలో ఏదైనా సమస్య తలెత్తితే వాటి విలువ ఆ ధారంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిషన్లను ఆశ్రయించవచ్చు. నష్టపోయిన వినియోగదారులకోసం ఉమ్మ డి జిల్లా పరిధిలో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టుఆవరణలో జిల్లా వినియోగదారుల వివా దాల పరిష్కార కమిషన్‌ (డీసీడీఆర్సీ) ఉంది. అయి తే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు వీటిపై అవగా హన కల్పిస్తే వినియోగదారులకు మరింతన్యాయం జరగనుంది. కేసులను 90 రోజుల్లో పరిష్కరించా లని చట్టం చెబు తోంది. చాలా కారణాలతో తీర్పుల్లో జాప్యం అవుతోంది. అయితే బాధితులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో మోసాలకు గురైతే నేరుగా ఫిర్యా దు చేసే అవకాశం ఉంది. ఒక్క రూపాయి నుంచి రూ.5లక్షల వరకు ఎలాంటి ఖర్చు లేకుండా న్యాయం పొందవచ్చు.

వినియోగదారుల కోర్టులో కేసుల వివరాలు..ఉమ్మడి జిల్లా పరిధిలో 1988 నుంచి ఇప్పటివరకు నమోదైనవి 7,408పరిష్కారమైనవి 7,237పెండింగ్‌లో ఉన్నవి 171

2023 నుంచి ఇలా..

సంవత్సరం నమోదైనవి పరిష్కారం అయినవి

2023 256 228

2024 163 29

2025 50 43

● అవగాహనతోనే హక్కుల రక్షణ ● ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ మో1
1/1

● అవగాహనతోనే హక్కుల రక్షణ ● ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ మో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement