● మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే
ఆదిలాబాద్‌రూరల్: సావిత్రిబాయి పూలే, మహాత్మ జ్యోతిబా పూలే దంపతులకు భారతరత్న ప్రకటించి గౌరవించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతిని జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మహిళా విద్య కోసం జ్యోతిరావు పూలే దంపతులు చేసిన కృషిని కొనియాడారు. ప్రభుత్వం వారి సేవలను గుర్తించి భారతరత్నతో గౌరవించాలన్నారు. ఇందులో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న, కోశాధికారి సతీశ్ గురుణులే, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్‌రావు డోలే, మాలీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు అనిల్, శ్రీను ఆచారి, హరీశ్, భాస్కర్ నందిని, తదితరులున్నారు.