బోథ్: మండలంలోని మారుమూల ఆదివాసీ గ్రామమైన బాబెరకు చెందిన ఆత్రం సుశీల గ్రామంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేసుకునేలా గ్రామస్తులను ప్రోత్సహించారు. ప్రతీ ఇంట్లో మొక్కలు నాటించే ప్రయత్నం చేశారు. అలాగే ఆదివాసీ గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈమె సేవలకు గుర్తింపుగా 2020లో అప్పటి గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా స్వచ్ఛ అవార్డు అందుకున్నారు. అలాగే 2022లో ఢిల్లీలో నిర్వహించిన ఆదివాసీల వర్క్‌షాప్‌నకు హాజరయ్యారు. మారుమూల గ్రామంలో పుట్టిన ఆదివాసీ మహిళ ఇలా ఉన్నతస్థాయికి ఎదిగారు. ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు.