● కరీంనగర్‌ సీపీగా స్థానచలనం ● నూతన ఎస్పీగా అఖిల్‌ మహాజన్‌ | - | Sakshi
Sakshi News home page

● కరీంనగర్‌ సీపీగా స్థానచలనం ● నూతన ఎస్పీగా అఖిల్‌ మహాజన్‌

Mar 8 2025 2:12 AM | Updated on Mar 8 2025 2:09 AM

ఎస్పీ గౌస్‌ ఆలం బదిలీ

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ ఎస్పీ గౌస్‌ ఆలం కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. నూతన ఎస్పీగా అఖిల్‌ మహజన్‌ జిల్లాకు బదిలీపై రానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేస్తున్న గౌస్‌ ఆలం 2024 జనవరి 4న జిల్లాకు వచ్చారు. ఈయన గతంలో ములుగు ఎస్పీగా పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు. జిల్లాలో 14 నెలల పాటు విధులు నిర్వహించారు. పార్లమెంట్‌ ఎన్నికలను సజావుగా నిర్వహించిన క్రమంలో ఎన్నికల సంఘం నుంచి ప్రశంసలు పొందారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యా ల నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారించారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. పేదలకు పంపిణీ చేసే పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చూశారు. పక్కనున్న మహారాష్ట్ర నుంచి దేశీదారు సరఫరా కాకుండా చర్యలు చేపట్టారు. ఈయన పనిచేసినకాలంలో 1200 కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. అలాగే మట్కా, గుట్కా నిర్మూలనకు చర్యలు తీసుకున్నా రు. ఏజెన్సీప్రాంతాల్లో హెల్త్‌ క్యాంపులు నిర్వహించారు. జైనూర్‌ ఘటన నేపథ్యంలో జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా గతనెల 6న ఎస్పీ వివాహం జరిగింది. జిల్లాలో పనిచేసిన కాలంలో మంచి గుర్తింపు పొందారు.

జిల్లాకు అఖిల్‌ మహాజన్‌ రాక..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న అఖిల్‌ మహాజన్‌ ఆదిలాబాద్‌ ఎస్పీగా బదిలీపై రానున్నా రు. 2017 బ్యాచ్‌కు చెందిన ఈయన ఇదివరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని మంచిర్యాల డీసీపీగా పనిచేశారు. అఖిల్‌ మహాజన్‌ జమ్మూ కశ్మీ ర్‌కు చెందినవారు. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) నుంచి పట్టభద్రులయ్యారు. కాగా ఈయన సిద్దిపేటలో శిక్షణ పొందగా, మంచిర్యాలలో ఏసీపీగా, తర్వాత రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లిలలో డీసీపీగా పనిచేశారు.

● కరీంనగర్‌ సీపీగా స్థానచలనం ● నూతన ఎస్పీగా అఖిల్‌ మహాజ1
1/1

● కరీంనగర్‌ సీపీగా స్థానచలనం ● నూతన ఎస్పీగా అఖిల్‌ మహాజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement