● ఆర్జీయూకేటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్
బాసర: విద్యార్థులు ఒత్తిడిని అధిగమించాలని బాసర ఆర్జీయూకేటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. బుధవారం స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్, స్టూడెంట్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధైర్యపడితే అపజయాలు ఆహ్వానిస్తాయని, ధైర్యంగా ముందుకెళ్తే విజయ సోపానం అవుతుందన్నారు. ఎస్‌ఈఐఎఫ్ ఫౌండర్ శామ్యూల్‌రెడ్డి, డైరెక్టర్ జ్యోతిర్మయి విద్యార్థులకు తమ సలహాలు అందించారు. సినీ నటుడు, మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ విద్యార్థుల్లో ఉత్సాహం నింపుతూ ప్రేరణ కల్పించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.