
గోల్డ్‌మెడల్, పట్టా అందుకుంటున్న హరీశ్‌గౌడ్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన పూదరి హరీశ్‌గౌడ్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఎంఫీల్)లో చేసిన విశేష పరిశోధనకుగానూ బంగారు పతకం సాధించాడు. బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన 16వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, తెలుగు యూనివర్సిటీ ఆచార్య తంగెడ కిషన్‌రావు, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్, ఎంఫీల్ పట్టా అందుకున్నాడు. ‘కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజా సంబంధ ప్రచార ప్రభావం–తెలంగాణ రాష్ట్ర అధ్యయనం’ అనే అంశంపై 2016–17 బ్యాచ్‌కు చెందిన హరీశ్‌గౌడ్ చేసిన విస్తృత స్థాయి పరిశోధనకు బంగారు పతకాన్ని అందుకున్నారు.