
జనసంద్రంగా కంకలమ్మ గుట్ట
శివసత్తుల పూనకాలు.. దేవతలకు మొక్కులు.. లేత బొంగుల ఊరేగింపు–వెదురు బొంగుల కళాకృతుల ప్రదర్శన.. తరలివచ్చిన భక్తులు.. నాటకాలు.. భజనలు.. సాంస్కృతి కార్యక్రమాలు.. కార్తీక మాసం ఆఖరు ఆదివారం కౌటాల మండల కేంద్రంలోని కంకలమ్మ గుట్ట (మేదరిగిరి)పై కంకలమ్మ– కేతేశ్వర స్వామి ఆలయ 19వ మహా జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు సైతం తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించాయి. ఆలయ కమిటీ చైర్మన్ సుల్వ కనకయ్య– కళ్యాణి ఆధ్వర్యంలో వేదపండితులు రాధాకృష్ణ శర్మ, శివరాం స్వామి, తులసిరామేశ్వర్ స్వామి ఆధ్వర్యంలో పూజలు చేశారు. సిర్పూర్(టి) ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆసిఫాబాద్ జిల్లా ఏఎస్పీ(అడ్మిన్) అచ్చేశ్వర్‌రావు, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో బందోబస్తు
నిర్వహించారు. – కౌటాల

గుట్టపై దీపాలు వెలిగిస్తూ..

మొక్కులు చెల్లిస్తున్న భక్తులు

ఎమ్మెల్యేను సన్మానిస్తున్న సభ్యులు

కొబ్బరికాయలతో మొక్కులు..

సామగ్రి కొనుగోలు చేస్తూ..

క్యూలైన్‌లో భక్తులు...

కంకలమ్మకు పూజలు చేస్తున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే రాజలక్ష్మి

కంకలమ్మకు పట్టు వస్త్రాలతో ఎమ్మెల్యే పాల్యాయి హరీశ్‌బాబు
