
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ గంగారెడ్డి
సారంగపూర్: మండలంలోని చించోలి(బి) ఎక్స్‌రోడ్డు వద్ద గంజాయి విక్రయిస్తున్న ముఠాను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మండలంలోని చించోలి(బి) ఎక్స్‌రోడ్డు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారించగా మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన బస్వంతే అనిల్, తొంబారే గౌతం అలియాస్ ఉత్తంలుగా గుర్తించారు. వారివద్ద గల బ్యాగులను తనిఖీ చేయగా 10కిలోల గంజాయి లభ్యమైంది. చంద్రాపూర్‌లో తమకు తక్కువ ధరకు గంజాయి లభ్యమవుతుందని, దానిని ఎక్కువ ధరకు నిర్మల్, హైదరాబాద్‌లలో విక్రయించడానికి తీసుకొచ్చామని అంగీకరించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో నిర్మల్ రూరల్ ఇన్‌చార్జి సీఐ పురుషోత్తంచారి, సారంగాపూర్ ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి, సిబ్బంది గౌస్, మనోజ్, జంగు, ఆకాష్ ఉన్నారు.